జిల్లాలో 1.15 లక్షల మంది రేషన్ కార్డులకోసం దరఖాస్తులు
వీటిలో 99,915 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తింపు
కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పేదలు
సంక్షేమ కార్యక్రమాలకు రేషన్‌కార్డు లింకు పట్టించుకోని ప్రభుత్వం
తిరుపతి: రేషన్‌కార్డుల కోసం పేద ప్రజలు అర్జీలు చేతబట్టుకుని రెవెన్యూ కార్యాలయాలు, నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలకు పైగా అయినప్పటికీ అదిగో ఇదిగో కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటూ ప్రజలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మభ్యపెడుతూనే ఉన్నారు.
గతంలో జరిగిన రెండు జన్మభూమి కార్యక్రమాలు, ప్రజావాణితో పాటు మండల కార్యాలయాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు జిల్లాలో 1.15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జన్మభూమి కమిటీలు ఆమోదం తెలిపి అర్హులుగా గుర్తించిన తరువాత వీటిని తహశీల్దారు కార్యాలయానికి పంపి ఈపీడీఎస్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. తర్వాత ప్రభుత్వం వీరికి కొత్త కార్డులను మంజూరు చేస్తుంది.
ఎదురు చూపులు
Published Sat, Jul 25 2015 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM
Advertisement