ఆటో బోల్తాపడి ఓ విద్యార్ధినికి తీవ్రగాయాలు కాగా, మరో ముగ్గురికి స్వల్పంగా గాయపడిన సంఘటన వి.కోట మండలం పామునిగానిపల్లి వద్ద మంగళవారం ఉదయం జరిగింది.
వి.కోట: ఆటో బోల్తాపడి ఓ విద్యార్ధినికి తీవ్రగాయాలు కాగా, మరో ముగ్గురికి స్వల్పంగా గాయపడిన సంఘటన వి.కోట మండలం పామునిగానిపల్లి వద్ద మంగళవారం ఉదయం జరిగింది. వి.కోట మండలం పాతూరుకి చెందిన చంద్ర పామునిగానిపల్లి జడ్పీ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది.ఈ రోజు ఉదయం స్కూల్‌కి వెళ్లేందుకు షేరింగ్ ఆటో ఎక్కింది. విద్యార్ధిని వెళుతున్న ఆటో పాముగానిపల్లి వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో విద్యార్ధిని కాలు విరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి స్వల్ప గాయలయ్యాయి. క్షతగాత్రులను కుప్పం ఆరోగ్య కేంద్రానికి తరలించారు.