ఎస్ఐపై తెలుగు తమ్ముళ్లు రాళ్ల దాడి | Sub Inspector Suneel Kumar reddy attacked by TDP Supporters in Chittoor district | Sakshi
Sakshi News home page

ఎస్ఐపై తెలుగు తమ్ముళ్లు రాళ్ల దాడి

Published Wed, May 7 2014 5:16 PM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

Sub Inspector Suneel Kumar reddy attacked by TDP Supporters in Chittoor district

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం సింగ సముద్రంలో ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు బుధవారం రాళ్లదాడికి దిగారు. ఆ ఘటనలో ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ని కుప్పంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలింగ్ బూత్ వద్ద ప్రలోభ పెడుతున్న టీడీపీ కార్యకర్తలను ఎస్ఐ అడ్డుకున్నారు. దాంతో సదరు కార్యకర్తల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

 

మమ్మల్నే అడ్డుకుంటావా అంటూ ఎస్ఐపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ఎస్ఐ సునీల్ కుమార్పై రాళ్ల వర్షం కురిపించారు. దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది ఆయన్ని హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐపై దాడిని పోలీసు సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement