ఎమ్మెల్యే వర్మ కారుకు అడ్డంగా కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్న ఎంపీపీ దంపతులు
తూర్పుగోదావరి, పిఠాపురం: అక్కడ గ్రామ సభ జరపాలంటే అధికారపార్టీ నేతలకు హడల్... జరపకపోతే అభాసుపాలవుతామపుకున్నారో ఏమో సినీ ఫక్కీలో డ్రామాకు తెర లేపారంటున్నారు స్థానికులు. జన్మభూమి గ్రామ సభ జరిగితే తమకు న్యా యం చేయాలంటూ అధికార పార్టీ నేతలను నిలదీయాలని అక్కడి సెజ్ బాధిత రైతులు – మిగతా 2లోu
ఎదురు చూస్తుంటే టీడీపీ నేతలు మాత్రం వారందరినీ బురిడీ కొట్టించి తమలో తామే గొడవ పడినట్లు నాటకమాడి గ్రామ సభను లేదనిపించేశారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఆరో విడత జన్మభూమి గ్రామ సభలో భాగంగా కొత్తపల్లి మండలం శ్రీరాంపురంలో బుధవారం నిర్వహించారు. అయితే ఆ గ్రామం సెజ్ బాధిత గ్రామం కావడంతో స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందని ముందుగానే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇంతలో పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ గ్రామ సభకు వచ్చారు. సభలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా కొత్తపల్లి ఎంపీపీ (టీడీపీ) పిర్ల సత్యవతి, ఆమె భర్త గంగాధర్ ఎమ్మెల్యేకు అడ్డుతగులుతూ తమకు మండలంలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, దానికి సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. అయితే సమాధానం చెప్పే సమయం ఇది కాదని సభ అయిన తరువాత చెబుతానంటూ ఎమ్మెల్యే వర్మ సభను జరుపుతుండగా ఎంపీపీ దంపతులు ఇద్దరు సభ నుంచి వెళ్లిపోయి ఎమ్మెల్యే కారుకు అడ్డంగా కూర్చుని సమాధానం చెప్పే వరకు వెళ్లనిచ్చేది లేదని ఆందోళనకు దిగారు. తూతూమంత్రంగా సభను ముగించేసిన ఎమ్మెల్యే వర్మ తన కారులో బయలుదేరగా ఎంపీపీ దంపతులు కారుకు అడ్డంగా ఉండిపోవడంతో పోలీసులు కలగజేసుకుని సర్దిచెప్పడంతో ఆందోళన విరమించేసి కారుకు తోవిచ్చేశారు. వారిలో వారు ఇలా గొడవ పడినట్లు కావాలనే హైడ్రామా ఆడారని, ఇన్నాళ్లూ లేని ప్రాధాన్యం గొడవ ఇప్పుడెందుకు తెరపైకి తెచ్చారని, ఇదంతా కావాలని అధికార పార్టీ నేతలు ఆడిన హైడ్రామాగా స్థానికులు చెప్పుకుంటున్నారు. నిజంగా వారికి అన్యాయం జరిగితే పోలీసులు చెబితే విరమించడమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment