రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించడంపై తెలంగాణ జేఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది.
రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించడంపై తెలంగాణ జేఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అఖిల పక్ష భేటిపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బుధవారం టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు.
కేంద్రం నోట్ను సిద్ధం చేసిన తర్వాత అఖిల పక్ష సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. నవంబర్ 1ని విద్రోహ దినంగా పాటిస్తామని చెప్పారు. అంతకుముందు అఖిల పక్ష సమావేశం గురించి కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటన చేశారు.