
సాక్షి, అమరావతి: తనను, తమ పార్టీని కించపరిచేలా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్‌ను వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి కోరారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, హెలో తదితర సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగ్‌లకు సంబంధించిన ఆధారాలు, వాటి అడ్రస్ లింక్‌లు, పోస్టింగ్‌లను డీజీపీకి మంగళవారం ఆయన అందజేశారు.
తన ఫొటోతో కార్టూన్స్ పెట్టి అసభ్య పదజాలంతో కొందరు పోస్టింగ్‌లు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. రాజ్యసభ ఎంపీగా, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తనను కించపరిచేలా, మనసును గాయపరిచేలా, తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఆ పోస్టులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment