రాష్ట్ర విభజన తట్టుకోలేక ఒక యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సీటీఎం రైల్వేస్టేషన్‌లో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలు... మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె రామిరెడ్డి లేఔట్‌కు చెందిన వెంకటేష్ కుమారుడు సోమశేఖర్(33) బార్బర్ షాపు పెట్టుకుని జీవించేవాడు.
మదనపల్లె క్రైం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన తట్టుకోలేక ఒక యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సీటీఎం రైల్వేస్టేషన్‌లో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలు... మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె రామిరెడ్డి లేఔట్‌కు చెందిన వెంకటేష్ కుమారుడు సోమశేఖర్(33) బార్బర్ షాపు పెట్టుకుని జీవించేవాడు. నెలరోజుల క్రితం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయడంతో సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం తారాస్థాయికి చేరిన సంగతి తెల్సిందే. ఆనాటి నుంచి మదనపల్లెలో జరుగుతున్న సమైక్యాంధ్ర బంద్, ర్యాలీలు, మానవహారాలు, రిలేదీక్షలు ఇలా పలు కార్యక్రమాల్లో సోమశేఖర్ పాల్గొంటున్నాడు. ఇంటికి రాగానే టీవీ పెట్టుకోవడం కేసీఆర్, సోనియాగాంధీలను తిడుతూ రాష్ట్రాన్ని విడగొట్టి ఎంతపని చేశారని మనోవేదనకు గురయ్యేవాడు. ఏమి జరిగిందో ఏమోకాని సోమవారం తెల్లవారుజామున ఇంట్లోంచి వెళ్లిన సోమశేఖర్ తిరిగి ఇంటికి రాలేదు.
రాత్రంతా రాకపోవడంతో పనిమీద ఏదైనా ఊరికి వెళ్లాడుకున్నారు. సోమశేఖర్ మాత్రం సీటీఎంలోని రైల్వేస్టేషన్‌కు వెళ్లి అక్కడే ఉండిపోయాడు. ఏ అర్ధరాత్రో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాత్రంతా ఎవరూ గమనించకపోవడంతో నురగలు కక్కుంటూ అపస్మారకస్థితిలోకి చేరుకున్నాడు. ఉదయాన్నే గమనించిన స్థానికులు బాధితున్ని 108లో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చికిత్స అందించినప్పటికీ అప్పటికే పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. మృతుడికి భార్య పద్మావతి, కుమారులు వంశీకృష్ణ(14), పవన్‌కుమార్(11) ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రైల్వేపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.