కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఉదయం ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.
కర్నూలు: కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఉదయం ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఓ సెల్‌టవర్ పైకి ఎక్కి బుడజంగాల కులానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నిరసన తెలిపారు. తమను ఎస్సీలుగా గుర్తించాలని వ్యక్తులు డిమాండ్ చేశారు. స్పష్టమైన హామీ ఇస్తేనే కిందకు దిగుతామని బీష్మించుకుని కూర్చున్నారు. పోలీసులు యువకులను కిందకు దించడానికి ప్రయత్నిస్తున్నారు.