విజయమ్మ సహా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల అరెస్ట్ | YS vijayamma arrested by police at assembly gate no.1 | Sakshi
Sakshi News home page

విజయమ్మ సహా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల అరెస్ట్

Published Thu, Jan 9 2014 1:05 PM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

విజయమ్మ సహా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల అరెస్ట్ - Sakshi

విజయమ్మ సహా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల అరెస్ట్

హైదరాబాద్ : సస్పెన్షన్ను నిరసిస్తూ అసెంబ్లీ గేట్.1 వద్ద ఆందోళనకు దిగిన  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సహా పార్టీ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు.  సమైక్యాంధ్ర గొంతును వినిపించేందుకు ప్రయత్నించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు.. స్పీకర్ నాదెండ్ల మనోహర్ గురువారం సభను నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

అనంతరం ఎమ్మెల్యేలు నిరసనకు దిగగా.... పోలీసులు వారిని బలవంతంగా వాహనాల్లోకి లాక్కెళ్లారు. అనంతరం గోషా మహాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా అరెస్ట్పై ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని వారు ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement