అసెంబ్లీలో వైఎస్ విజయమ్మ సహా ఎమ్మెల్యేల అరెస్ట్ | YS Vijayamma, other YSRCP MLAs arrested in assembly | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో వైఎస్ విజయమ్మ సహా ఎమ్మెల్యేల అరెస్ట్

Published Wed, Jan 29 2014 9:51 PM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

అసెంబ్లీలో వైఎస్ విజయమ్మ సహా ఎమ్మెల్యేల అరెస్ట్ - Sakshi

అసెంబ్లీలో వైఎస్ విజయమ్మ సహా ఎమ్మెల్యేల అరెస్ట్

శాసనసభలో సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో సహా ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీలో అరెస్ట్ చేసిన వారిని వాహనాల్లో లోటస్ పాండ్ కు తరలించినట్టు సమాచారం. 
 
మధ్యాహ్నం 2 గంటల తర్వాత అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభలోనే ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనుమతితో అసెంబ్లీ ప్రాంగణంలోకి భారీగా పోలీసు వాహనాలను మెహరించారు. గత 7 గంటలుగా ఆందోళన చేస్తున్న వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను మార్షల్ సహాయంతో పోలీసులు వాహనంలోకి ఎక్కించి పార్టీ కార్యాలయానికి తరలించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement