కాకినాడ :వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 5న కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ తెలిపారు. స్థానిక సూర్యకళా మందిరంలో మహాధర్నా పోస్టర్‌ను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విజయసాయిరెడ్డి, సాయిదుర్గా ప్రసాదరాజుతో పాటు పలువురు నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మహాధర్నాలో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పోస్టర్లను జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు పంపించి విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ, పింఛన్ల తొలగింపు సహా అనేక ప్రభుత్వ వైఫల్యాలపై ఈ ఆందోళన చేస్తున్నామన్నారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో పాల్గొంటారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, సీజీసీ సభ్యులు పినపే విశ్వరూప్, కుడుపూడి చిట్టబ్బాయి, జక్కంపూడి విజయలక్ష్మి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, వివిధ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు, అనుబంధ సంఘాల కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు
పాల్గొన్నారు.
5న కలెక్టరేట్ వద్ద మహాధర్నా
Published Mon, Dec 1 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM
Advertisement
Advertisement