న్యూఢిల్లీ : గత కొన్ని నెలలుగా దేశీయ టెలికాం పరిశ్రమ ఎన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందో తెలిసిందే. తమ నష్టాలను తగ్గించుకోవడానికి టెల్కోలు భారీ ఎత్తున్న ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. 2017 రిపోర్టు ప్రకారం దాదాపు లక్షా 50 మంది ఉద్యోగులను టెల్కోలు తీసివేయనున్నాయని నిపుణులు అంచనావేశారు. 2018-19లో తొలి మూడు క్వార్టర్‌లో మరో 90 వేల మందిపై వేటు పడనుందని కూడా అంచనాలు వచ్చాయి. దీంతో ఈ పరిశ్రమలో భారీ ఎత్తున్న ఉద్యోగులను తీసివేస్తున్నారని ఆందోళనలు పెరిగిపోయాయి. ఈ ఆందోళన నేపథ్యంలో ఎకనామిక్ టైమ్స్ ఓ కొత్త రిపోర్టు వెల్లడించింది.
మూడు అతిపెద్ద టెలికాం సంస్థలు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియోలు ఈ ఏడాది చివరి వరకు 2 వేల మంది కంటెంట్ స్పెషలిస్ట్‌ను చేర్చుకోనున్నాయని తాజా రిపోర్టు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను టెల్కోలను నియమించుకుంటున్నాయని వెల్లడించింది. ఈ నిపుణులను అటు సిలికాన్ వ్యాలీ నుంచైనా.. ఇటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) నుంచైనా చేర్చుకోవాలని చూస్తున్నాయని రిపోర్టు పేర్కొంది. వీరికి ప్యాకేజీ కూడా భారీ ఎత్తునే ఉండనుంది. కోటికి పైగా ప్యాకేజీలను ఈ దిగ్గజ కంపెనీలు ఆఫర్ చేయబోతున్నాయట. స్పోర్ట్స్, మ్యూజిక్, మూవీస్ వంటి వివిధ రకాల కంటెంట్‌ను సబ్‌స్క్రైబర్లకు ఆఫర్ చేసే క్రమంలో డేటా వినియోగం కూడా భారీగా పెరిగింది.
వచ్చే నెలల్లో టెల్కోలు, కంటెంట్ లైబ్రరియన్లను, బ్రాడ్‌కాస్టర్ రిలేషన్‌షిప్స్‌ను ఎవరైతే నిర్వహిస్తారో వారిని నియమించుకోనున్నాయని ఏటీ కియర్నీ డిజిటల్ ప్రాక్టిస్, లీడ్ కమ్యూనికేషన్స్ అజయ్ గుప్తా చెప్పారు. యాప్ డిజైనింగ్, యూజర్ ఇంటర్‌ఫేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పర్సనలైజేషన్, ఇంజిన్ డిజైన్ రికమండేషన్ వంటి యాప్-సెంట్రిక్ స్కిల్స్ కలిగిన వారిని నియమించుకోవాలని ఎయిర్‌టెల్ చూస్తోందని తెలుస్తోంది. రిలయన్స్ జియో కూడా.. ఎడ్యుకేషన్, వొకేషన్ ట్రైనింగ్‌కు సబంధించిన మార్కెట్ ప్రొగ్రామ్స్‌ను నియమించుకోవాలని చూస్తోంది. ఇటీవలే వొడాఫోన్ ఇండియా తన కంపెనీలో కంటెంట్ టీమ్ వైస్ ప్రెసిడెంట్‌ను నియమించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment