సువెన్ లైఫ్కు మరో రెండు పేటెంట్లు
హైదరాబాద్, బిజి నెస్ బ్యూరో : ఫార్మా సంస్థ సువెన్ లైఫ్ సెన్సైస్ తాజాగా భారత్, జపాన్‌లో రెండు పేటెంట్లు దక్కించుకుంది. అల్జీమర్స్, పార్కిన్సన్స్ తదితర కేంద్ర నాడీ మండల సంబంధ సమస్యల చికిత్సలో ఉపయోగపడే కొత్త రసాయన మేళవింపు (ఎన్‌సీఈ)లకు ఇవి లభించినట్లు వివరించింది. 2032 దాకా వీటి గడువు ఉంటుందని సంస్థ పేర్కొంది. దీంతో భారత్‌లో మొత్తం 19, జపాన్‌లో 19 పేటెంట్లు లభించినట్లయిందని కంపెనీ సీఈవో వెంకట్ జాస్తి తెలిపారు. సోమవారం బీఎస్‌ఈలో సువెన్ లైఫ్ సెన్సైస్ షేరు స్వల్పంగా లాభపడి రూ. 189 వద్ద ముగిసింది.