![Unitech shares rally over 16% on NCLT order - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/11/unitech.jpg.webp?itok=ba-ZUWAx)
సాక్షి, ముంబై: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన రియల్టీ దిగ్గజం యూనిటెక్‌కి స్టాక్‌మార్కెట్‌లో భారీ ఊరట లభించింది. నిర్వహణ నియంత్రణను చేపట్టేందుకు ప్రభుత్వానికి అనుమతించటంతో యునిటెక్ షేర్లు ఈ రోజు కూడా భారీగా లాభపడుతున్నాయి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఆర్డర్‌తో శుక్రవారం19శాతానికి పైగా లాభపడిన యూనిటెక్ సోమవారం కూడా తన జోరును కొనసాగిస్తోంది. 16శాతానికి పైగా లాభాలతో ట్రేడ్ అవుతోంది.
కంపెనీపై అజమాయిషీ తీసుకునే బాటలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) యూనిటెక్‌కి గట్టి షాకిచ్చింది. నిధుల స్వాహా, నిర్వహణ లోపాల అభియోగాలపై యూనిటెక్ బోర్డులోని మొత్తం ఎనిమిది మంది డైరెక్టర్లను సస్పెండ్ చేసింది. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం కొత్తగా పది మంది డైరెక్టర్లను నామినేట్ చేయాలని ఆదేశించింది. వారి పేర్లను తదుపరి విచారణ తేదీ అయిన డిసెంబర్ 20లోగా అందించాలని కేంద్రానికి సూచన చేసింది.
Comments
Please login to add a commentAdd a comment