ఈ పతనంలో ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి ? | Which Funds Should Invest In? | Sakshi
Sakshi News home page

ఈ పతనంలో ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి ?

Published Mon, Oct 22 2018 1:32 AM | Last Updated on Mon, Oct 22 2018 1:32 AM

Which Funds Should Invest In? - Sakshi

ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్‌ పతన బాటలో నడుస్తోంది కదా ! ఈ కరెక్షన్‌ నుంచి ప్రయోజనం పొందాలనుకుంటున్నాను. రూ. లక్ష వరకూ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. దీర్ఘకాలం పాటు ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించాలన్నది నా ఆలోచన.  నేను ఇన్వెస్ట్‌ చేయడానికి తగిన ఫండ్స్‌ను సూచించండి.   –ప్రియ భావన, హైదరాబాద్‌  
ఇప్పుడు స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ఉంది కదాని ఇన్వెస్ట్‌మెంట్‌  చేయాలనుకోవడం మంచిదే. కానీ మరింతగా పడిపోదన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు కదా ! అందుకని ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి కొన్ని నియమాలను అందరూ పాటించాల్సి ఉంటుంది. మార్కెట్‌ పెరుగుతున్పప్పుడూ, పతనమవుతున్నప్పుడూ కూడా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించాలి. మీరు దీర్ఘకాలం పాటు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించాలనుకుంటున్నారు.

కాబట్టి, మీకు రెండు మార్గాలు సూచిస్తున్నాను. మొదటిది మీరు ఇప్పటివరకూ స్టాక్‌ మార్కెట్‌ సంబంధిత సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయకపోతే, ఏదైనా మంచి బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ను ఎంచుకోండి.మీ దగ్గరున్న మొత్తాన్ని ఐదు సమాన భాగాలుగా చేసి, ఒక్కో భాగాన్ని ఒక్కో నెలలో ఇన్వెస్ట్‌ చేయండి.మొత్తం సొమ్ములను ఒకేసారి ఇన్వెస్ట్‌ చేయవద్దు. మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఎప్పుడూ ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయకూడదు. సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (ఎస్‌ఐపీ) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తే, మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఇక రెండో మార్గం మీరు ఇప్పటికే స్టాక్‌ మార్కెట్‌  సంబంధిత సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసిన అనుభవం మీకు ఉందనుకోండి.

లేదా కొంచెం నష్ట భయాన్ని భరించగలిగితే,..., ఏదైనా మల్టీక్యాప్‌ ఫండ్‌ను ఎంచుకోండి. మీరు కనుక స్టాక్‌ మార్కెట్‌ సంబంధిత సాధనాల్లో 2–3 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లయితే, మార్కెట్‌ ఒడిదుడుకుల గురించి మీకు ఒక అవగాహన ఉంటుంది. అందుకని మల్టీక్యాప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఈక్విటీ అండ్‌ డెట్‌ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. ఒక మల్టీక్యాప్‌ ఫండ్స్‌ కోసమైతే, మిరా అసెట్‌ ఇండియా ఈక్విటీ, ఎస్‌బీఐ మేగ్నమ్‌ మల్టీక్యాప్‌లను పరిశీలించవచ్చు.  

వడ్డీరేట్లకు, బాండ్ల రాబడులకు మధ్య  సంబంధం ఎలా ఉంటుంది ? బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ఏ విషయాలను పరిశీలించాలి ? –వెంకట్, గుంటూరు  
బాండ్ల ధరలకు, వడ్డీరేట్లకు విలోమ సంబంధం ఉంటుంది. వడ్డీరేట్లు పెరిగినప్పుడు బాండ్ల ధరలు తగ్గుతాయి. అలాగే వడ్డీరేట్లు తగ్గితే బాండ్ల ధరలు  పెరుగుతాయి. వడ్డీ రేట్లు పెరిగితే, బాండ్ల ధరలు తగ్గుతాయి. కాబట్టి బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసే  బాండ్‌ ఫండ్స్‌ రాబడులు కూడా తగ్గుతాయి. అలాగే వడ్డీరేట్లు తగ్గితే, బాండ్ల ధరలు పెరుగుతాయి. అందుకని వడ్డీరేట్లు తగ్గితే, ఓపెన్‌–ఎండ్‌ బాండ్‌ ఫండ్స్‌కు ప్రయోజనం కలుగుతుంది. అయితే ఇది స్వల్పకాలిక అంశం. బాండ్ల విలువ మదింపు సాధారణమైన లెక్క లాంటిదే.

దీనిని సులభంగానే అంచనా వేయవచ్చు. భవిష్యత్తు నగదు ప్రవాహాలను డిస్కౌంట్‌ చేయవచ్చు. ఇవి ఈక్విటీ ఫండ్స్‌లాగా కాదు. బాండ్‌ ఫండ్లలో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ముఖ్యంగా మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. బాండ్‌ ఎంత మంచిది ? ఎంత వడ్డీరేటును ఆ బాండ్‌ చెల్లిస్తుంది ? ఆ బాండ్‌ కాలపరిమితి ఎంత ? ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకొని బాండ్ల విలువను మదింపు చేయవచ్చు. అందుకని వడ్డీరేట్లు పెరిగినప్పుడు, తగ్గినప్పుడు బాండ్ల ధరలు తగ్గడం, పెరగడం సంభవిస్తుంది. ఈ తరుగుదల లేదా పెరుగుదలను మనం ముందుగానే అంచనా వేయగలం.  

నేను దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. అందుకని ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకున్నాను. అయితే నా పోర్ట్‌ఫోలియోలో డెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలు ఏమీ లేవు. డెట్‌ విభాగంలో కూడా ఇన్వెస్ట్‌ చేసే నిమిత్తం ఒక హైబ్రిడ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి.   –షరీఫ్, విజయవాడ  
మీ పోర్ట్‌ఫోలియోలో డెట్‌ కూడా భాగం ఉండాలనే ఆలోచన మంచిదే. అసలు ఒక ఇన్వెస్టర్‌ పోర్ట్‌ఫోలియోలో డెట్‌ విభాగం(బాండ్లు, బ్యాంక్‌ డిపాజిట్లు, కంపెనీల డిపాజిట్లు, పీపీఎఫ్, ఈపీఎఫ్, తదితర ) తప్పనిసరిగా ఉండాల్సిందే. దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒక ఇన్వెస్టర్‌ పోర్ట్‌ఫోలియోలో డెట్‌ విభాగం తప్పనిసరిగా ఉండాల్సిందే. మార్కెట్‌ ఒడిదుడుకుల నుంచి ఈ విభాగం ఇన్వెస్టర్‌కు రక్షణనిస్తుంది. సాధారణంగా రెండు అంశాల కోసం డెట్‌ విభాగంలో ఇన్వెస్ట్‌ చేయాలి.

మొదటిది ఎమర్జన్సీ ఫండ్‌...అత్యవసర సమయాల్లో అవసరమయ్యే నిధి ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఎమర్జెన్సీ ఫండ్‌ నిధులు  మార్కెట్‌ రిస్క్‌లకు గురి కాకుండా ఉండాలి. మీ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్‌లో ఇది కొంత శాతంగా ఉండకూడదు. మీ ఆరు నెలల అవసరాలకు సరిపడేలా.. రూ. 50,000 నుంచి రూ. లక్ష వరకూ ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి. మీకు చిన్న పిల్లలు ఉన్నా, మీ కుటుంబంలో పెద్ద వయస్సు వాళ్లు ఉన్నా, ఈ అత్యవసర నిధి కోసం మరింతగా కేటాయింపులు జరపాలి.

ఇక రెండోది మీ పోర్ట్‌ఫోలియోను రీబ్యాలన్స్‌  చేయడానికి డెట్‌ విభాగంలో ఇన్వెస్ట్‌ చేయడం తప్పనిసరి. మీరు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న దాంట్లో 10% డెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌  సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయాలి. మిగిలిన మొత్తాన్ని మీరు అనుకున్నట్లుగానే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. మీరు రిటైర్మెంట్‌కు దగ్గరగా వచ్చినప్పుడు అంటే... 2–3 ఏళ్ల కాలంలో రిటైర్‌ కాబోతున్నారనుకుందాం.. అప్పుడు ఈక్విటీ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాల్లోకి మళ్లించండి.


- ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement