
సాక్షి, విశాఖపట్నం : తణుకులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మండపాక గ్రామంలో కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయిన శీలం రఘుబాబు.. శవమై తేలడం కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. పెంటపాడు మండలం పత్తిపాడు వద్ద గుర్తు తెలియన మృతదేహం లభ్యమైంది. హత్యచేసి కాల్చిపడేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆ మృతదేహాన్ని శీలం రఘుబాబుగా అతని బంధువులు గుర్తించారు. ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ హత్య జరిగిందంటూ స్థానికులు, బంధువులు అనుమానిస్తున్నారు. ఎటువంటి ఘర్షణలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.