హాంకాంగ్ : అక్రమ సంబంధాన్ని కొనసాగించేందుకు తనకు అడ్డుగా ఉందన్న కారణంగా ఓ డాక్టర్ దారుణానికి పాల్పడ్డాడు. భార్యను, 16 ఏళ్ల కూతురిని ప్లాన్ ప్రకారం హత్య చేశాడు. మూడేళ్ల తర్వాత నిందితుడిని కోర్టు దోషిగా తేల్చింది. ఈ దారుణం హాంకాంగ్‌లో చోటుచేసుకుంది.
నిందితుడు ఖా కిమ్ సన్ హాంకాంగ్‌లోని చైనా విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా, డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ క్రమంలో కిమ్‌కు ఓ మహిళతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయంలో తరచుగా భార్యతో గొడవపడే డాక్టర్.. తనకు విడాకులు ఇవ్వాలని కోరేవాడు. అందుకు భార్య నిరాకరించడంతో భార్యను, పెద్ద కూతురు(16)ను హత్య చేశాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా రెండు పెద్ద బెలూన్లు కొని, అందులో కార్బన్ మోనాక్సైడ్ వాయువును నింపాడు. చిన్న కూతురిని హోం వర్క్ చేసుకోమని చెప్పిన కిమ్.. భార్యతో పాటు పెద్ద కూతురిని తన కారులో ఉంచి అన్ని డోర్లు లాక్ చేశాడు.
కారులో ముందుగానే ఉంచిన బెలూన్ల నుంచి విడుదలైన కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చిన వీరిద్దరూ కారులోనే మృతిచెందారు. కేసు నమోదు చేసిన హాంకాంగ్ పోలీసులు, అనుమానం వచ్చి డాక్టర్ కిమ్‌ను అదుపుతోకి తీసుకున్నారు. మూడేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కిమ్ ఈ హత్యలకు కారకుడని గుర్తించారు. అక్రమ సంబంధాన్ని కొనసాగించేందుకు భార్య అడ్డుగా ఉందని, ఎన్నిసార్లు అడిగినా విడాకులు ఇవ్వలేదన్న కారణంగా దారుణానికి పాల్పడినట్లు అంగీకరించాడు. ప్రొఫెసర్ కిమ్ రెండు బెలూన్లలో కార్బన్ మోనాక్సైడ్ నింపడం తాను చూశానని.. ఎలుకలను చంపేందుకు ఇలా చేస్తున్నట్లు తమకు చెప్పాడని మరో ప్రొఫెసర్ వెల్లడించారు. కేసు తాజా విచారణలో కిమ్‌ను దోషిగా తేల్చిన హాంకాంగ్ కోర్టు త్వరలో శిక్షను ఖరారు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment