కలిసి చంపారు..ఆత్మహత్యగా చిత్రీకరించారు | Husband Killed Wife And Filmed Like Suicide | Sakshi
Sakshi News home page

కలిసి చంపారు..ఆత్మహత్యగా చిత్రీకరించారు

Published Fri, Apr 13 2018 11:24 AM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

Husband Killed Wife And Filmed Like Suicide - Sakshi

లక్ష్మి మృతదేహం

అశ్వారావుపేటరూరల్‌: వివాహితను భర్త, అత్తమామ కలిసి హత్య చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారు. అశ్వారావుపేట మండలంలో గురువారం ఇది జరిగింది. ఎస్‌ఐ వేల్పుల వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలు..  మండలంలోని అచ్యుతాపురం గ్రామానికి చెందిన గొల్లపల్లి రాంబాబుకు పన్నేండేళ్ల క్రితం, పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన గొల్లపల్లి లక్ష్మి(30)తో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు. వివాహమైన కొన్నాళ్ల వరకు కాపురం సజావుగానే సాగింది. కట్నం కోసం కొంతకాలంగా ఆమెను భర్త, అత్తమామ కలిసి వేధిస్తున్నారు.

గురువారం ఉదయం ఆమెతో భర్త రాంబాబు గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే ఆమెను ఆ ముగ్గురూ కలిసి ఇంట్లోనే హత్య చేశారు. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించారు. దీనిపై ఆమె కుటుంబీకులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు. తన చెల్లి ఆత్మహత్య చేసుకోలేదని, వరకట్నం కోసం భర్త, అత్తమామ కలిసి హత్య చేశారని పోలీస్‌ స్టేషన్‌లో లక్ష్మి సోదరుడు ఉప్పల జోగిరాజు ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికు శవ పంచనామా కోసం పోలీసులు తరలించారు. ఆమె భర్త రాంబాబు, మామ వెంకటేశ్వర్లు, అత్త వీరలక్ష్మిపై హత్య కేసును ఎస్‌ఐ నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement