ప్రతీకాత్మక చిత్రం
గుర్గావ్ : వివాహేతర సంబంధాన్ని నిలదీసిందని కట్టుకున్న భార్యను కర్వా చౌత్ రోజే ఖతం చేశాడు ఓ బ్యాంక్ ఉద్యోగి. ఈ ఘటన హర్యానాలోని గుర్గావ్ ఫరిదాబాద్ రోడ్ సమీపంలోని అన్సాల్ వ్యాలీలో గత శనివారం చోటుచేసుకుంది. దీపావళికి ముందు వచ్చే చవితి నాడు నార్త్‌కి చెందిన మహిళలు కర్వా చౌత్‌ను జరుపుకుంటురాన్న విషయం తెలిసిందే. ఆ రోజు మహిళలు తమ భర్త కోసం ఉపవాసం ఉంటూ సాయంత్రం వేళ పూజ నిర్వహించి ఆ తర్వాత జల్లెడలో చంద్రుడితో పాటు భర్త ముఖాన్ని చూసి, ఉపవాసం విడిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. కానీ నిందితుడు తనకోసం ఉపవాసం ఉన్న తన భార్యను కర్వాచౌత్ అడ్డంగా పెట్టుకోని 8వ అంతస్తు నుంచి తోసేశాడు. ఈ ఘటన వివరాలను పోలీసులు సోమవారం మీడియాకు వెల్లడించారు. (చదవండి: పూజారులు వెలివేశారు.. భార్య వదిలేసింది)
విక్రమ్ చౌహన్ అనే ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి తన సతీమణి దీపికను 8వ అంతస్తు నుంచి నెట్టేసి చంపాడు. మృతురాలి తండ్రి అహుజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరిచి రెండురోజులు కస్టడీలోకి తీసుకున్నారు. దీపిక తండ్రి అహుజా మీడియాతో మాట్లాడుతూ.. విక్రమ్ చౌహన్, దీపికలు 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారని, వారికి నాలుగేళ్ల కూతురు, ఆరునెలల బాలుడున్నారని తెలిపారు. వారి నివాసం పక్కనే నివసించే ఓ మహిళతో విక్రమ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనీ, సదరు మహిళ తరుచూ వారి ఫ్లాట్‌కు రావడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయన్నారు. ఈ విషయంపై తన కూతురు నిలదీయడంతో దారుణంగా కొట్టి, కర్వా చౌత్ సాకుగా బాల్కనీ నుంచి తోసేశాడని కన్నీటి పర్యంతమయ్యారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. (చదవండి: పురుషులే టార్గెట్)
Comments
Please login to add a commentAdd a comment