
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్రం విధించిన లాక్‌డౌన్ నిబంధనలను పలువురు లెక్కచేయడం లేదు. ప్రతి ఒక్కరి సాకారంతోనే ప్రమాదకరమైన కరోనా వైరస్‌ను జయించవచ్చని ప్రభుత్వాలు చెబుతున్న పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 59 ఏళ్ల ఓ వ్యక్తికి అతని కొడుకు బుద్ధి చెప్పాడు. తొలుత లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా బయటకు వెళ్లిన తన తండ్రికి.. ఇది సరైనది కాదని చెప్పిచూశాడు. లాక్‌డౌన్ ఎందుకు పాటించాలో కూడా వివరించాడు.
అయితే ఎంత చెప్పినా తన తండ్రి వినిపించుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటివరకు భారత్‌లో 2301 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 56 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment