
బెంగళూరు : కాపాడాల్సిన కనురెప్పలే కాటేస్తున్నాయి. సొంతవారే వావివరుసలు మరిచి చిన్నారులను చిదిమేస్తున్నారు. అభం శుభం తెలియని బాలికలకు మాయమాటలు చెప్పి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మృగాలుగా ప్రవర్తిస్తూ మానవత్వానికే మాయని మచ్చగా మిగులుతున్నారు. కన్నతండ్రే కీచకుడిగా మారి కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఈనెల 23న బెంగళూరులో చోటుచేసుకుంది. హరలూర్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల ఓ వ్యక్తి తన కూతురిపై కన్నేశాడు. 19 ఏళ్ల యువతి జలుబు, దగ్గుతో బాధపడుతుంటే మందులకు బదులు నిద్ర మాత్రలు ఇచ్చి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. (మాయ మాటలతో బాలికను లొంగదీసుకుని..)
మరుసటి రోజు ఉదయం తండ్రి ఆమె పక్కనే నిద్రిస్తుండటంతో తనపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించిన యువతి ఈ విషయాన్ని సవతి తల్లికి వివరించింది. దీనిపై సవతి తల్లి నోరు మెదపకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన బాధితురాలు టాయిలెట్ క్లీనర్ తాగి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడింది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు యువతిని వెంటనే ఆసుత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె తండ్రిని అరెస్టు చేసినట్లు, ఈ ఘటనలో సవతి తల్లి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో సైతం దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. (వీళ్లు మనుషులు కాదు రాక్షసులు)
Comments
Please login to add a commentAdd a comment