
సాక్షి, కృష్ణా : తిరువూరు ఆర్టీఓ చెక్‌పోస్టు వద్ద గుజరాత్ లారీ డ్రైవర్‌ను పోలీసు కానిస్టేబుళ్లు చితకబాదారు. డ్రైవర్ దగ్గర లారీలకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ చలనా కట్టాలని ఆర్టీఓ అధికారులు హెచ్చరించడంతో ఈ వివాదం తలెత్తింది. చలానా కట్టకుంటే అనుమతించేది లేదని ఆర్టీఓ సిబ్బంది లారీలను నిలిపివేశారు.
కాగా లారీలు జాతీయ రహదారికి అడ్డంగా ఉన్నాయన్న కారణంతో ఆర్టీఓ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌పై విచక్షణ రహితంగా దాడి చేశారు. దీంతో గుజరాతీ లారీ డ్రైవర్ తీవ్రంగా గాయాలపాలవడంతో అతన్ని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తనపై అనవసరంగా పోలీసులు దాడి చేసారంటూ డ్రైవర్ వారిపై ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment