పొన్నాల సోదరి మనవడి దుర్మరణం | Ponnala Lakshmaiah Sister Grandson Died In Accident | Sakshi
Sakshi News home page

పొన్నాల లక్ష్మయ్య సోదరి మనవడి మృతి

Published Mon, Aug 12 2019 8:46 PM | Last Updated on Mon, Aug 12 2019 9:07 PM

Ponnala Lakshmaiah Sister Grandson Died In Accident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌, సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య సోదరి నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరి మనవడు ధృపత్‌(22) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. గచ్చిబౌలి పోలీసు స్టేషను పరిధిలోని విప్రో సర్కిల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ధృపత్‌ డివైడర్‌ను ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు...మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement