
మృతుడు పైలా పరుశురామ్ రెడ్డి(ఫైల్)
శ్రీకాకుళం, ఇచ్ఛాపురం రూరల్: బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లిన ఓ వ్యక్తి కరోనా భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అతని స్నే హితులు తెలిపిన వివ రాల ప్రకారం... ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి నీలాద్రిపేటకు చెందిన పైలా పరశురామ్ రెడ్డి(47) పద్దెనిమిది ఏళ్ల కిందట పొట్టకూటి కోసం అబుదాబి(యుఏఈ) వెళ్లి అక్కడే నేషనల్ పెట్రోలియం అండ్ కనస్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నారు. గత ఏడాది మేలో జరిగిన గ్రామదేవత ఉత్సవాలకు వచ్చిన పరశురామ్ జూన్‌లో మళ్లీ అబుదాబి వెళ్లిపోయాడు.
ఈ ఏడాది జనవరిలో స్వగ్రామం రావాల్సి ఉండగా కరోనా వైరస్ అధికంగా ఉండటంతో వీసా దొరకలేదు. అంతే కాకుండా కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో గత కొన్ని రోజులుగా ఆ యనను క్వారంటైన్‌లో పెట్టినట్టు సమాచారం. ఈ పరిణామాలపై మనస్తాపం చెందిన పరశురా మ్ రెడ్డి సోమవారం క్వారంటైన్‌లోనే ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం. లొద్దపుట్టిలో మా త్రం గుండెపోటుతో ఆయన మరణించినట్లు స మాచారం అందిందని బంధువులు చెబుతున్నా రు. మృతుడు పరశురామ్‌కు భార్య పైలా లక్ష్మితో పాటు కుమారుడు కేశవరావు, కుమార్తె పద్మలు ఉండగా మరో కుమార్తెకు పెళ్లైంది.
Comments
Please login to add a commentAdd a comment