సేలం: కోడలి ఆగడాలు తట్టుకోలేక మహిళ తన భర్త, కుమారుడు సహా ఆత్మహత్య చేసుకుంటున్నామని సహాయక కమిషనర్ ఇచ్చిన వాట్సప్ సమాచారం సేలంలో కలకలం రేపింది. వివరాలు.. సేలం సీలనాయకన్‌పట్టి జీఆర్‌నగర్‌కు చెందిన మోహన్ జౌలి దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈయన భార్య రంగనాయకి (56) సేలం కార్పొరేషన్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరి కుమారుడు శశిధరన్ (28) ఇతని భార్య ప్రేమ. వీరికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది. శశిధరన్ హోసూర్‌లో ఉద్యోగం చేస్తూ కుటుంబంతో ఉండేవాడు. అక్కడ శశిధరన్‌కు భార్యకు మధ్య తరచూ గొవడలు ఏర్పడుతున్నాయి. దీంతో ఇటీవల మోహన్ భార్య బిడ్డలతో సేలంలో ఉన్న తల్లి ఇంటికి వచ్చేశాడు. ఇక్కడికి వచ్చినా గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ స్థితిలో ప్రేమ బంధువులు రంగనాయకి ఇంటికి వచ్చి గొడవపడినట్టు సమాచారం.
వాట్సప్ మెసేజ్ కలకలం..
దీంతో తీవ్ర ఆవేదన చెందిన రంగనాయకి సంగగిరిలో ఉన్న ఆమె చెల్లెలు విజయ సెల్వికి వాట్సప్‌లో ఒక మేసేజ్ ఇచ్చింది. అందులో.. కోడలి ఆగడాలు భరించలేకున్నాం.. తన భర్త, కుమారుడితో కలిసి తాము ఆత్మహత్య చేసుకోబోతున్నాం.. అని పంపించింది. విషయం తెలుసుకుని హుటాహుటిన అక్క ఇంటికి వచ్చిన విజయ సెల్వి ఇంటికి తాళం వేసి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందింది. తర్వాత తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా అక్కడ ఒక లేఖ రాసి ఉన్నట్టు తెలిసింది. అందులో కూడా కోడలు, వారి కుటుంబీకులు పెడుతున్న ఇబ్బందులు తట్టుకోలేక పోతున్నామని రాసి ఉన్నట్టు సమాచారం.
రంగంలోకి ప్రత్యేక పోలీసులు..
విజయ సెల్వి ఫిర్యాదు మేరకు అన్నదానపట్టి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పోలీసుల విచారణలో రంగనాయకి మైసూర్‌లో ఉన్న కులదేవత ఆలయానికి వెళ్లినట్లు తెలిసింది. మరో వైపు హోగ్నెకల్‌కు వెళ్లి ఉండవచ్చని సమాచారం అందింది. పోలీసులు శుక్రవారం రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఒక బృందం మైసూర్‌కు, మరో బృందం హోగ్నెకల్‌కు వెళ్లారు. శశిధరన్ కూడా ఒక వీడియోను వాట్సప్‌లో సమాచారం పంపించినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని వారి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment