
మృతి చెందిన జయ
చెన్నై, తిరువొత్తియూరు: బైక్‌ను లారీ ఢీకొనడంతో భర్త కళ్ల ఎదుటే భార్య మృతి చెందింది. చెన్నై మీంజూరు రామిరెడ్డి పాళయం ప్రాంతానికి చెందిన యువరాజ్ (28), భార్య జయ (24) మంగళవారం సాయంత్రం బైక్‌పై బంధువు ఇంటికి బయలుదేరారు. తిరువళ్లూరు జీఎన్‌టీ రోడ్డులో వెళుతుండగా వెనుక వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. అదుపు తప్పి ఇద్దరూ కింద పడ్డారు. ఆ సమయంలో జయ తల, నడుము భాగంలో లారీ ఎక్కిదిగడంతో తీవ్రంగా గాయపడింది. సురేష్ హెల్మెట్ వేసుకుని ఉండడంతో స్పల్వ గాయాలతో బయటపడ్డాడు. జయను చికిత్స నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యలో ఆమె మృతిచెందింది. కళ్ల ఎదుటే భార్య మృతి చెందడంతో కన్నీరుమున్నీరయ్యా డు. మాధవరం పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.