
అమెరికాలో తెలుగు వైద్యుడికి శిక్ష
న్యూయార్క్: అమెరికాలో జరిగిన ఓ మెడికల్ కుంభకోణంలో భారతీయ మూలాలున్న వైద్యుడిని అమెరికా కోర్టు దోషిగా తేల్చింది. జడ్జి అతనికి శిక్ష, జరిమానా విధించారు. షికాగోలోని ఓ ఆసుపత్రి రోగులకు సంబంధించి ఫెడరల్ హెల్త్‌కేర్ ప్రోగ్రామ్ కింద రావాల్సిన మెడికల్ రీయింబర్స్‌మెంట్ నిధులను కాజేశారని కూచిపూడి వెంకటేశ్వరరావు అనే తెలుగు వైద్యుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయమై అక్కడి కోర్టు ఐదు నెలలుగా విచారణ చేపట్టి అతడిని దోషిగా నిర్ధారించింది. ఈ కుంభకోణం మూలంగా సేక్రెడ్ హార్ట్ అనే ఆసుపత్రి మూతపడింది. రోగులకు సంబంధించి నిధులను మంజూరు చేసే అధికారం కలిగిన కూచిపూడి వెంకటేశ్వరరావు లంచాలు తీసుకొని అక్రమాలకు తెరలేపారని పేర్కొంది.