డ్రంకన్ డ్రైవ్‌లో చేపట్టిన అకస్మిక తనిఖీల్లో 34మంది కి కోర్టు శిక్ష విధించింది.
కాచిగూడ: డ్రంకన్ డ్రైవ్‌లో చేపట్టిన అకస్మిక తనిఖీల్లో 34మందిపై కేసులు నమోదు చేసి బుధవారం ఎర్రమంజిల్‌లోని 3వ ఎంఎం కోర్టులో హజరు పర్చినట్లు కాచిగూడ ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ పీజీ రెడ్డి తెలిపారు. వీరిలో 19మందికి కోర్డు జైలు శిక్షతో పాటు రూ.2వేలు అపరాధ రుసుంను విధించిందని ఆయన తెలిపారు. 9మందికి రూ.2వేలు, 6మందికి రూ.2వేలుతో పాటు ఒక రోజు సోషల్ సర్వీస్ సేవ చేయాలని కోర్టు శిక్షలు విధించిందని తెలిపారు.