రూపేకార్డుల పంపిణీకి చర్యలు
ఆలూరు: జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఖాతాదారులందరికీ రూపేకార్డుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని డీసీసీబీ డీజీఎం సునిల్‌కుమార్ తెలిపారు. స్థానిక సింగిల్ విండో సహకార పరపతి సంఘ ఽకార్యాలయంలో కర్షక జ్యోతి ఫైనాన్ష్‌యల్ ఆర్గనైజర్ బసవరాజ్ ఆధ్వర్యంలో బుధవారం రూపేకార్డులతో నగదు బదిలీలను చేసుకునే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సునిల్‌కుమార్ రైతులు, చిరువ్యాపారులు, ఖాతాదారులను ఉద్దేశించి మాట్లాడారు. భవిష్యత్‌లో ప్రతిఒక్కరికి బ్యాంకు ఖాతాల ద్వారానే లావాదేవీలు కొనసాగించుకోవాల్సి వస్తుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో 1.50లక్షల రూపే కార్డుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో స్థానిక కేడీసీసీ బ్యాంకు మేనేజర్ రమేష్, జిల్లా అధికారి శాస్త్రీ, జనజ్యోతి ఫైనాన్షియల్ కౌన్సిల్ సభ్యుడు రామూర్తి, ఆలూరు సహకార సింగిల్ విండో సీఈఓ వెంకటరెడ్డి, డైరెక్టర్లు హనుమంతు, అనిల్, స్వామి పాల్గొన్నారు.