విత్తన ’గూడు’కు స్థలం కరువు..! | ap seeds problems | Sakshi
Sakshi News home page

విత్తన ’గూడు’కు స్థలం కరువు..!

Published Mon, Dec 5 2016 3:46 AM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM

విత్తన ’గూడు’కు స్థలం కరువు..! - Sakshi

విత్తన ’గూడు’కు స్థలం కరువు..!

ఏళ్ల తరబడి అద్దె భవనంలో అవస్థలు
మూలుగుతున్న రూ.50 లక్షల నిధులు
అద్దెల రూపంలో ఏటా లక్షల ఖర్చు
స్థలం కోసం ఏడేళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
ఇబ్బందులు పడుతున్న రైతులు
స్థల సేకరణలో నిలువెల్లా నిర్లక్ష్యం

 
ఒంగోలు టూటౌన్ :  జిల్లాలో విత్తనాభివృద్ధి సంస్థకు గూడు కరువైంది. అధికారులు, సిబ్బంది ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం అద్దెలకు  లక్షలు వ్యయం చేస్తున్నారు తప్పితే సొంతగూడు గురించి పట్టించుకోలేదు. నెలకు కార్యాలయానికి రూ.11 వేలు, విత్తన గోడౌన్‌కు రూ.85 వేలు అద్దె చెల్లిస్తున్నారు.  సొంత భవనాలకు స్థలం కేటారుుంచడంలో పాలకులు సంవత్సరాల పాటు కాలయాపన చేస్తున్నారు. అసలు విత్తనాభివృద్ధి సంస్థ ఎప్పుడు ఎక్కడికి మారుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఫలితంగా ఏటా రైతులు విత్తనాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.   

అద్దె భవనం కష్టాలు:   
జిల్లాలో విత్తనాభివృద్ధి సంస్థకు సొంత గూడు లేకపోవడంతో దశాబ్దాలుగా అద్దె భవనంలో నెట్టుకొస్తున్నారు. అదీ కార్యాలయం ఒక చోట ఉంటే  విత్తన గోడౌన్ మరొక చోట ఉండేది. తొలుత బైపాస్‌రోడ్డులోని ఫ్‌లైఓవర్ బ్రిడ్జికి ఉత్తరవైపున ఒక అద్దెభవనంలో కొంతకాలం నడిచింది. అక్కడ నుంచి మారి దక్షిణం వైపున మరొక అద్దెభవనంలోకి మార్చాల్సి వచ్చింది.  అక్కడ గోదాములు సరిపోక తిరిగి పండరీపురంలో ఒక అద్దె కార్యాలయంలో కొంతకాలం  నిర్వహించారు. మళ్లీ అక్కడ నుంచి ఒంగోలు సమీపంలోని త్రోవగుంట వద్దకు మార్చారు. దాదాపు ఆరేళ్లలో  ఐదు చోట్లకు కార్యాలయం మారిందంటే విత్తన గూడుకు  అద్దె కష్టాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కార్యాలయాన్ని అధికారులు ఎప్పుడు ఎక్కడికి మారుస్తారో రైతులు వెతుక్కొని వెళ్లాల్సిన పరిస్థితి జిల్లాలో నెలకొంది. ప్రస్తుతం ఇప్పుడు దక్షిణ బైపాస్‌కు తూర్పున అంజయ్య రోడ్‌కు  కొద్ది దూరంలో ఉంది. విత్తనగోడౌన్ ఒంగోలుకు సమీపంలోని త్రోవగుంట వద్ద ఒక అద్దె భవనంలో ఏర్పాటు చేశారు.

అందుబాటులో రూ.50 లక్షల నిధులు:  
విత్తనాభివృద్ధి సంస్థ  సొంత కార్యాలయం ఏర్పాటుకు 2010వ సంవత్సరంలో ప్రభుత్వానికి విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు ప్రపోజల్స్ అప్పటి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి వెళ్లారుు.  విత్తన ప్రాసెసింగ్ యూనిట్, స్టోరేజ్ గోడౌన్, కోల్డ్ స్టోరేజ్, ఆఫీస్ మొత్తానికి ఐదు ఎకరాలు స్థలం అవసరమని తేల్చారు.  2013వ సంవత్సరంలో భవన నిర్మాణానికి రూ.2. 62 కోట్లు అవసరమని ఏపీఎంఐడీసీ ఇంజనీరింగ్ శాఖ అధికారులు అంచనాలు వేశారు. అప్పటి నుంచి నేటి వరకు స్థలం కోసం కలెక్టర్లు, పాలకుల దృష్టికి విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు తీసుకెళ్తూనే ఉన్నారు.  ఆ క్షణాన ఉన్నతాధికారులు రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం.. ఆ తరువాత వదిలేయడం పరిపాటిగా మారింది.  కానీ స్థల సేకరణను రెవెన్యూ అధికారులు ఒక కొలిక్కి తీసుకురాలేకపోతున్నారు. ఏడేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. అప్పటి నుంచి కేంద్రం విడుదల చేసిన  రూ.50 లక్షల నిధులు మూలుగుతూనే ఉన్నారుు.  

అద్దెల రూపంలో లక్షల వ్యయం:   
విత్తనాభివృద్ధి సంస్థకు ఏటా అద్దెలకు లక్షలు ఖర్చుపెడుతున్నారు. కార్యాలయానికి నెలకు రూ.11 వేలు, గోడౌన్‌కు రూ.85 వేల నెలకు చెల్లిస్తున్నారు. వీటితో పాటు రారుుతీ విత్తన సరఫరా సమయంలో విత్తనాలు ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ ఉంచాల్సి వస్తోంది. ప్రస్తుత రబీసీజన్‌లో రైతులకు 60 వేల క్వింటాళ్లను సరఫరా చేశారు. వీటిని  మూడు నెలలుగా ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టాల్సి వచ్చింది. క్వింటాకు రూ.112 అద్దె చొప్పున వేల రూపాయాలు చెల్లిస్తున్నారు. ఇలా మొత్తం దాదాపు ఏటా రూ.12 లక్షల వరకు అద్దెలకే చెల్లించాల్సి వస్తోంది.   ఈ అదనపు భారం అంతా రైతులపైనే పడుతుంది.
 
నాణ్యమైన విత్తనం కొరత :
జిల్లా మొత్తం మీద 6 లక్షలకు పైగా రైతులు ఉన్నారు. 5.40 లక్షల వరకు పట్టాదారు భూములు కలిగిన అన్నదాతలు ఉన్నారు. 70 శాతం  వరకు వ్యవసాయంపైనే ఆధారపడి కుటుంబాలు జీవిస్తున్నారుు. ఏటా రబీ, ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం అందించే లక్షలాది రూపాయల రారుుతీ విత్తనాలను ఈ కార్యాలయం నుంచే రైతులకు సరఫరా చేస్తారు. అన్నదాతకు చెందిన పొలాల్లోనే మూలవిత్తనాన్ని పెట్టిచ్చి..పంటకొచ్చాక తిరిగి మళ్లీ సేకరిస్తుంటారు. వీటిని ప్రాసెసింగ్ చేసి మొలక శాతం పరీక్షించి అనంతరం బాగుంటే తిరిగి రైతులకు సరఫరా చేస్తారు. ఇంత ప్రాముఖ్యం ఉన్న విత్తనాభివృద్ధి సంస్థ  ప్రభుత్వ నిర్లక్ష్యంలో కొట్టుమిట్టాడుతోంది.   
 
ఏపీ సీడ్స్  మేనేజర్ ఏమన్నారంటే ...

కార్యాలయం స్థలం కోసం రెవెన్యూ అధికారులను సంప్రదిస్తూనే ఉన్నామని  ఏపీ సీడ్‌‌స మేనేజర్ కె.బుచ్చమ్మ తెలిపారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దృష్టికి ఇటీవల తీసుకెళ్లామని వివరించారు. స్థలం కేటారుుంచేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఒంగోలు ఆర్డీవోకి  చెప్పారన్నారు.
 
ఏపీ సీడ్స్ కు సహకరించని సర్వేయర్లు
 విత్తనాభివృద్ధి సంస్థ భవన నిర్మాణానికి సొంత స్థల సేకరణలో ఆ శాఖ సిబ్బందికి స్థానిక సర్వేయర్లు సహకరించడం లేదన్న ఆరోపణలు ఉన్నారుు. జిల్లా కేంద్రానికి సమీపంలోని కొత్తపట్నం, మద్దిపాడు, మార్టూరు, ఎస్‌ఎన్‌పాడు, ఒంగోలు మండలాల పరిధిలోని ప్రభుత్వ స్థలాలను పలు మార్లు పరిశీలించినా.. ఎక్కడా స్థలం కొలిక్కిరాలేదు. అన్ని చోట్ల ప్రభుత్వ స్థలాలకు స్థానికులు అడ్డుంకుల నుంచి ఎదురవడం.. తిరిగి రావడం.. పాలకులు పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. ఇటీవల సంతనూతలపాడు మండలం మైనంపాడువద్ద ఉన్న డొంకపోరంబోకు, అసైన్‌‌డ భూమిని స్వాధీనం చేసుకొని ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు తాత్సారం చేసినట్లు సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement