గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామ సమీపంలో గల తమ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు.
గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామ సమీపంలో గల తమ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. సీఎం రాకపై ముందస్తు సమాచారం ఉండడంతో జిల్లా ఎస్పీ సుమతి, సిద్ధిపేట డీఎస్పీ శ్రీధర్ అధ్వర్యంలో ఫాంహౌస్ వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. సాయంత్రం అల్లం తీసే పనులను, పాలిహౌస్ ఏర్పాటు పనులను పరిశీలించినట్లు తెలిసింది. రాత్రి ఇక్కడే బస చేసి శుక్రవారం ఖమ్మం జిల్లా భద్రాచలం వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.