నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఓ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తేనే పల్నాడు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ...
టీడీపీ అధికార ప్రతినిధి మాణిక్యవరప్రసాద్
మాచర్లటౌన్: నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఓ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తేనే పల్నాడు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాదరావు అభిప్రాయపడ్డారు. మంగళవారం పట్టణానికి వచ్చిన ఆయన కేసీపీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు స్మార్ట్ జిల్లాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. పల్నాటి ప్రాంతాభివృద్ధికి ప్యాకేజీ ఇవ్వాలని సీఎంను కోరినట్లు తెలిపారు.
పల్నాటి అభివృద్ధి కోసం ఇక్కడి నేతలు సీఎంతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే వెనుకబడిన పల్నాడులోని సమస్యలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుందని తెలిపారు. మార్కెట్ యార్డు చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్మన్ గోపవరపు శ్రీదేవి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.