బెటాలియన్‌లో వసతుల కల్పనకు కృషి
బెటాలియన్స్ ఐజీ మీనా
కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): ఏపీఎస్‌పీ రెండో బెటాలియన్‌లో వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని బెటాలియన్స్ ఐజీ ఆర్‌కే మీనా పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బెటాలియన్‌ను సందర్శించారు. ముందుగా బెటాలియన్‌లోని ఎస్‌పీవీఎన్ ఇంగ్లిషు మీడియం స్కూలును సందర్శించి కొత్తగా నిర్మించిన స్టేజీ, డైనింగ్ షెడ్, ఎల్‌కేజీ, నర్సరీ విభాగాలను ప్రారంభించి ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులను బావి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. అనంతరం బెటాలియన్ కమాండెంట్లు ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన సభకు హాజరై రిటైర్డ్ డీఐజీ జే.ప్రసాద్‌బాబును సన్మానించారు. కార్యక్రమంలో కామాండెంట్లు విజయకుమార్, కోటేశ్వరరావు, సీహెచ్ విజయరావు, అరుణ్‌జైట్లీ, ఎల్‌ఎస్ పాత్రుడు, సీహెచ్ శ్యామూల్‌జాన్, జగదీశ్‌కుమార్, సూర్యచంద్, బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ ఎస్‌కే అల్లాబకాష్ పాల్గొన్నారు.