రైతు సేవలో నిమగ్నం కావాలి
రైతు సేవలో నిమగ్నం కావాలి
Published Tue, Aug 16 2016 4:08 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి విజయ్‌కుమార్
గుంటూరు వెస్ట్ : వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను విస్తృతపరిచి రైతుల సేవలో మరింతగా నిమగ్నం కావాలని వ్యవసాయ శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి, విశ్వవిద్యాలయ ఉపకులపతి టి.విజయ్‌కుమార్ కోరారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరుకు తరలివచ్చిన తర్వాత ప్రథమంగా దేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో(లాం) సోమవారం నిర్వహించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి విజయ్‌కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే పెద్దదిగా విభజన జరిగిన తర్వాత కూడా తన ఉనికిని చాటుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్రంలో 27 మంది నాన్‌టీచింగ్ ఉద్యోగస్తులకు మెరిటోరియస్ అవార్డులను ప్రకటించారు. ఇందులో గుంటూరు అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయ సిబ్బంది, లాం ఫాం ఉద్యోగులు ఏడుగురికి నగదు బహుమతి, సర్టిఫికెట్లను అందజేశారు. వారిలో ఎ.వెంకటేశ్వరరావు (సూపరింటెండెంట్), ఎస్.జనార్ధన్‌రావు (సూపరింటెండెంట్), జి.వెంకటరావు (సీనియర్ అసిస్టెంట్), ఆర్.పిచ్చయ్య (ఫొటోగ్రాఫర్), ఎన్.విజయకుమారి (క్లర్క్ కం టైపిస్టు), గంజి బాబు (ఆఫీస్ అసిస్టెంట్), కె.సూరిబాబు (ఎలక్రీ్టషియన్) ఉన్నారు. వర్సిటీ పాలకమండలి సభ్యులు మేకా లక్ష్మీనారాయణ, రిజిస్ట్రార్ డాక్టర్ టీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement