కారంపూడిలో రైతు ఆత్మహత్య
Published Thu, Sep 29 2016 8:02 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
కారంపూడి (గుంటూరు జిల్లా) : కారంపూడిలో ముత్యాలంపాటి సత్యనారాయణ(50) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా వున్నాయి. పొలానికి గురువారం వెళ్లిన సత్యనారాయణ అక్కడ పొలానికి కొట్టగా మిగిలి వున్న పురుగుమందును తాగి ఇంటికి వచ్చాడు. పిల్లలకు ఫోన్ చేసి, కడసారి నన్ను చూసుకోవచ్చని త్వరగా రావాలని కోరాడు. విషయం తెలిసిన భార్య, కుటుంబ సభ్యులు హుటాహుటిన సత్యనారాయణను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సత్యనారాయణ గతంలో ఆదర్శ రైతుగా పని చేశాడు. మూడున్నర ఎకరాల్లో పత్తిపంట వేసి నష్టపోయాడు. అప్పుల బాధకు, ఇతర సమస్యలు తోడు కావడంతో ఆయన ఉసురు తీసుకున్నాడు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
Advertisement
Advertisement