ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం
కట్టంగూర్ : ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి అన్నారు.
కట్టంగూర్ : ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం కట్టంగూర్‌లో జరిగిన ఆపార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీఆర్‌ఎస్ వైఫల్యాలను నికరంగా నిలదేసే పార్టీ సీపీఎం మాత్రమేనన్నారు. పార్టీ మారే నాయకులు ఏం సాధించటానికి పార్టీలు మారుతున్నారో ప్రజలకు వివరించాలన్నారు. జీఓ 123ను హైకోర్టు కొట్టివేసినా ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లటం రైతులపై యుద్ధం చేయటమేనన్నారు. ఈ సమావేశంలో నాయకులు ఎండీ జహంగీర్, బోళ్ల నర్సింహారెడ్డి, మామిyì సర్వయ్య,lకందాల ప్రమీల, మందుల విప్లవ్‌కుమార్, బొప్పని పద్మ, పెంజర్ల సైదులు, గద్దపాటి యాదగిరి, ధర్మారెడ్డి, యాదయ్య, మారయ్య, భిక్షం తదితరులున్నారు.