
తెలంగాణ టీడీఎల్పీ సమావేశం విజయవాడలోనా?
తెలంగాణ పచ్చ తమ్ముళ్లపై మంత్రి హరీశ్ మండిపాటు
బాన్సువాడః తెలంగాణలోని టీడీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వత్తాసు పలుకుతూ, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ టీడీఎల్పీ సమావేశాన్ని విజయవాడలో నిర్వహించడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ టీడీపీ నేతలను త్వరలో ప్రజలే తరిమికొడతారని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యతిరేకించారని, అలాగే డిండి ప్రాజెక్టును, వాటర్ గ్రిడ్ పనులను వ్యతిరేకించారని, చంద్రబాబు డెరైక్షన్‌లో టీడీపీ నేతలు యాక్షన్ చేస్తున్నారని హరీశ్ విమర్శించారు.