
'ఓపిక, ఊపిరి ఉన్నంతవరకూ పోరాడతా'
ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ సోదరులందరికీ మీడియా ద్వారా ఒక లేఖను విడుదల చేశారు.
తుని: ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కాపులను బీసీలో చేర్చాలని తీర్మానం చేసి కేంద్రానికి 9వ షెడ్యూల్‌లో చేర్చమని పంపే హామీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు గుర్తులేదని కాపు ఉద్యమనేత, ముద్రగడ పద్మనాభం విమర్శించారు. ఎన్నికలలో కాపు రిజర్వేషన్‌ను పునరుద్దరిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయమని కోరితే చంద్రబాబు అందరిన్నీ ముద్దాయిలుగా చేస్తున్నారన్నారని మండిపడ్డారు. గత తుని కాపు ఐక్య గర్జన సంఘటన సమయంలో ప్రభుత్వం అమాయకులపై కేసులు బనాయించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ కేసులో విషయంలో ముద్రగడ పద్మనాభం సోమవారం కాపు ఉద్యమ సోదరులందరికీ మీడియా ద్వారా ఒక లేఖను విడుదల చేశారు. తుని ఘటనపై తిరిగి పునర్విచారణ పేరుతో వందల మందిని కేసులలో ఇరికించడానికి ఇటీవల మనలో కొంతమందికి నోటీసులు పంపినట్టు మీడియా ద్వారా తనకు తెలిసిందని లేఖలో తెలిపారు. మీడియాలో అనుకూలంగా వార్తలు వస్తున్నాయని మీడియా స్వేచ్ఛపై ప్రభుత్వం ఆంక్షలు కూడా మనకు తెలిసేందనన్నారు. కేసులో విషయంలో ఏ పోలీసు అధికారి విచారణ పేరుతో నోటీసులు పంపినా తీసుకోండి' అని ముద్రగడ పిలుపునిచ్చారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి ధైర్యంగా వెళ్లండి అని చెప్పారు. కొత్త పథకాల పేరుతో చంద్రబాబు మనల్ని మోసగించే ప్రకటనలు చేస్తున్నారనీ, వారి మాటలు అబద్దాలతో నడుస్తున్నాయన్న సంగతి గమనించండి' అంటూ ముద్రగడ సూచించారు.
చివరికి బేడీలు వేయించి జైలుకు పంపినా సిద్ధపడండి' అంటూ లేఖలో తెలిపారు. కేసులకు భయపడడానికి మన సోదరలందరూ ముద్దాయిలం కాదూ.. సంఘవిద్రోహులం, తీవ్రవాదులం అంతకటే కాదన్నారు. తెలగ, బలిజ, ఒంటరి బిడ్డలమని పేర్కొన్నారు. ఎక్కడా కూడా పిరికితనం, భయం ఉండకూడదన్నారు. ఈ పోరాటంలో మీతోపాటే నేను కూడా ఉన్నాను' అని చెప్పారు. 'నన్ను నా కుటుంబాన్ని అవమానించడం వల్ల ఉద్యమం నుంచి తొలగిపోను. ఎన్ని అవమానాలు ఎదురైనా భరిస్తాను. ప్రలోభపెట్టి, భయపెట్టి నానుంచి మిమ్మల్ని దూరం చేసినా ఉద్యమం నుంచి పారిపోను' అని స్పష్టం చేశారు. ఓపిక ఉన్నంత వరకు కాదు.. ఊపిరి ఉన్నంతవరకూ జాతి కోసం పోరాడతాను అని మరోసారి చెబుతున్నానంటూ ధైర్యం చెప్పారు. భావితరాల భవిష్యత్తు కోసం అందరం సైనికుల్లా పోరాడుదాం' అని ముద్రగడ పిలుపునిచ్చారు.
దయచేసి పోలీసు విచారణ కోసం ఎవరూ, ఏ చోటికి హాజరైంది తేది, స్థలంతో పాటు, మీ పేరు, తండ్రి గారి పేరు, సెల్ నెంబరు, ఆధార్ కార్డు నెంబర్‌తో ఈ దిగువ తెలిపిన నెంబర్లకు నేను కోరిన సమాచారం యస్.ఎమ్.యస్. చేయండి. 98480 38888, 98482 77199, 98497 41777 మనలో చాలా మందికి వాట్సాఫ్ సౌకర్యం లేదు కావునా వారికి ఈ సమాచారాన్ని అందజేయడం అవసరమైతే ఈ సమాచారాన్ని మీరు తీసుకుని ఈ నెంబర్లకు పంపడం చేయమని ముద్రగడ కోరారు.