కేసీ సబ్ ఛానల్ గండి పూడ్చివేత
కేసీ సబ్ ఛానల్ గండి పూడ్చివేత
Published Tue, Jan 17 2017 10:48 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM
నంద్యాలరూరల్: మండల పరిధిలోని కానాల గ్రామం వద్ద పొన్నాపురం కేసీ కెనాల్ సబ్‌చానెల్‌కు ఆదివారం తెల్లవారుజామున పడిన గండిని మంగళవారం నాటికి పూడ్చివేశారు. నీటి ప్రవాహం సబ్ చానెల్‌లో పెరగడం, కాల్వ గట్లు బలహీనంగా ఉండటంతో మిట్నాల బ్రిడ్జి 11కి.మీ. వద్ద కేసీ సబ్ చానెల్‌కు గండి పడింది. దీంతో సుమారు 157ఎకరాల ఆవాల పంటకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి సాక్షి దినపత్రికలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఇందుకు స్పందించిన కేసీ కెనాల్ జిల్లా ఉన్నతాధికారులు వెంటనే నంద్యాల కేసీ కెనాల్ ఏఈ చంద్రుడిని అప్రమత్తం చేశారు. దీంతో మంగళవారం కాల్వకు పడిన గండిని పూడ్చివేశారు. ఈ సందర్భంగా ఏఈ చంద్రుడు మాట్లాడుతూ ఆదివారం తెల్లవారుజామున కేసీ సబ్‌చానెల్‌కు గండి పడటంతో నీరు పంట పొలాలను పట్టుకుందన్నారు. రైతుల సమాచారం మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారి చేయడంతో సోమ, మంగళవారాల్లో వర్క్ ఇన్‌స్పెక్టర్లు, లస్కర్లు శ్రమించి ట్రాక్టర్లు, ప్రొక్లెయిన్ల ద్వారా మట్టి, ఇసుక, సిమెంట్, రాళ్లు వేసి గండి పూడ్చివేశామని తెలిపారు. వర్క్ ఇన్‌స్పెక్టర్ నూర్‌బాషా లస్కర్లు రాజు, ఉమామహేశ్వరరెడ్డి, మద్దిలేటి, రాజమల్లయ్య గండి పూడ్చివేత పనుల్లో పాల్గొన్నారని తెలిపారు.
Advertisement
Advertisement