ఐబీ ఆరోగ్య రక్షతో లాభాలెన్నో..
Published Wed, Jul 20 2016 7:43 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
కామవరపుకోట : యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్సు కంపెనీతో కలిసి ఇండియన్ బ్యాంకు తన ఖాతాదారుల కోసం ఆరోగ్యరక్ష అనే ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ వివరాలను ఇండియన్ బ్యాంకు కామవరపుకోట మేనేజర్ డి.రంగబాబు వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం..
– ఇది గ్రూపు హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ.
– ఈ పథకంలో చేరేందుకు గరిష్ట వయోపరిమితి 65ఏళ్లు.
– జీవితాంతం వరకు పాలసీని రెన్యూవల్ చేయించుకోవచ్చు.
– దీనికి సెక్షన్ 80–డీ కింద ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది.
–నిబంధనలకు లోబడి నెట్‌వర్కు హాస్సిటళ్లలో మాత్రమే టీపీఏ ద్వారా కాష్‌లెస్ ట్రీట్‌మెంట్ సదుపాయం ఉంది.
– కుటుంబానికంతటికీ రక్షణ ఉంటుంది.
– గరిష్ట బీమా మొత్తం రూ.10 లక్షలు.
–3 నెలల వయసు వారి నుంచి 65 ఏళ్ల వారి వరకూ అందరికీ ఈ పాలసీ వర్తిస్తుంది.
– ఈ పాలసీకి ముందస్తు వైద్య పరీక్షలు అవసరం లేదు.
– పోర్టబిలిటీ అవకాశం ఉంది.
– ప్రమాద సమయాల్లో తప్ప మొదటి సంవత్సరం బీమా కవరేజీకి 30 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.
– మొదటి రెండు కాన్పులకు మహిళలకు ప్రసూతి ఖర్చులు చెల్లిస్తారు.
– పాలసీ చేసే నాటికే వ్యాధులు ఉన్నట్టయితే నలభై ఎనిమిది నెలల తరువాత మాత్రమే బీమా చేసిన వ్యక్తికి కంటిన్యూస్ కవరేజీ ఉంటుంది.
– బీమా చేసిన వ్యక్తులు సెలవులకు గానీ,, వ్యాపార లావాదేవీల నిమిత్తం గానీ నేపాల్, భూటాన్ దేశాలకు వెళితే వారికి చికిత్స నిమిత్తం క్యాష్‌లెస్ సదుపాయం ఉండదు.
మూడు ప్లాన్లలో పాలసీ అమలు
ప్లాన్–ఏ ఖాతాదారు, భార్య, ఇద్దరు పిల్లలకు వర్తిస్తుంది.
ప్లాన్–బీ ఖాతాదారు, భార్య, ఇద్దరు పిల్లలకు వర్తిస్తుంది.
ప్లాన్–సీ ఖాతాదారు, భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరు, మొత్తం ఐదుగురు సభ్యులకు వర్తిస్తుంది.
– పర్సనల్ యాక్సిడెంట్ డెత్ కవర్ కింద ఖాతాదారునికి మెడిక్లెయిమ్ కింద బీమా చేసిన సొమ్ములో వంద శాతం, భార్య/భర్తకు యాభై శాతం, పిల్లలకు ఇరవైఐదు శాతం చెల్లిస్తారు.
నామినేషన్ సౌకర్యం ఉంది.
ఆరోగ్య రక్ష ప్రీమియం (సర్వీస్ టాక్సుతో కలిపి)
బీమా మొత్తం రూ.లక్ష రూ.2 లక్షలు రూ.3 లక్షలు రూ.4 లక్షలు రూ.5 లక్షలు రూ.10 లక్షలు
ప్లాన్–ఏ రూ.1390 రూ.2606 రూ.3669 రూ. 4589
రూ. 5512 రూ. 9793
ప్లాన్–బీ రూ.2067 రూ. 3900 రూ.5450 రూ. 6813
రూ. 8176 రూ.17230
ప్లాన్–సీ రూ.3453 రూ. 6508 రూ.9088 రూ.11350 రూ.13615 రూ.42426
Advertisement
Advertisement