చెకింగ్ లేకుండా వెళుతున్న పోలీసుల బంధువులు
అమరావతి (పెదకూరపాడు): అమరలింగేశ్వర స్వామి వారి దర్శనం కోసం రూ. 300 వీఐపీ టికెట్ కొన్న భక్తులకు మాత్రమే సింహద్వారం వద్ద ఉన్న పోలీసు సిబ్బంది మెటల్ డిటెక్టవ్ చెకింగ్ చేస్తున్నారు. అధికారులు, బంధువులు, పోలీసు సిబ్బంది బంధువులను మాత్రం చెకింగ్ లేకుండా పంపుతున్నారు. అధికారుల బంధువర్గం మాత్రం టికెట్టు లేకుండానే దర్జాగా దర్శనం చేసుకుంటున్నారు.