'ప్రత్యేక హోదాపై వెంకయ్య, చంద్రబాబు దొంగాట' | ramakrishna demands modi for special status statement to AP | Sakshi
Sakshi News home page

'ప్రత్యేక హోదాపై వెంకయ్య, చంద్రబాబు దొంగాట'

Published Wed, Oct 21 2015 12:20 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

'ప్రత్యేక హోదాపై వెంకయ్య, చంద్రబాబు దొంగాట' - Sakshi

'ప్రత్యేక హోదాపై వెంకయ్య, చంద్రబాబు దొంగాట'

విశాఖపట్నం: ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు దొంగాట ఆడుతున్నారంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. విశాఖలో ఆయన మీడియాతో బుధవారం మట్లాడారు. ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం(ఈ 22న) నాడు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ 23న ప్రధాని దిష్టిబొమ్మలు దహనం చేస్తామన్నారు. 

ప్రత్యేక హోదాపై 13 జిల్లాల్లో 13 రోజుల పాటు సాగిన పాదయాత్రకు సంఘీభావం తెలిపిన వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, మాల మహానాడు, ప్రజా సంఘాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లేఖపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చిందులు వేస్తున్నారు, దానికి అర్థమే లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement