ముగిసిన శివచతుస్సప్తాహ భజనలు
ముగిసిన శివచతుస్సప్తాహ భజనలు
Published Wed, Nov 30 2016 10:23 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైలం: కార్తీకమాసాన్ని పురస్కరించుకుని భక్తులో్లఆధ్యాత్మిక భావాలు పెంపొందించడానికి ఏర్పాటు చేసిన శివచతుస్సప్తాహ భజనలు బుధవారంతో ముగిశాయి. గత నెల 31న కార్తీకమాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని చారిత్రాత్మకమైన వీరశిరోమండపంలో ప్రారంభమైన ఈ శివ సప్తాహభజనలకు అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తపూజలను నిర్వహించారు. ఈ అఖండ శివభజనలలో ''ఓం నమ శివాయ'' శివపంచాక్షరి భజన 24గంటల పాటు నిర్వహించారు. గురునిమిషాంబా, చెన్నకేశవ, శ్రీ రామాంజనేయస్వామి, సుంకులమ్మ భజనమండళ్లు నెలరోజులపాటు ఈ భజన సంకీర్తనామ పంచాక్షరిలో పాల్గొన్నట్లు ఈఓ నారాయణభరత్ గుప్త తెలిపారు. శివచతుస్సప్తాహ భజనల ముగింపులో భాగంగా బుధవారం చండీశ్వరుడికి ప్రత్యేకపూజలను నిర్వహించారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, శ్రీశైలప్రభ ఎడిటర్ కడప అనిల్‌కుమార్, భక్తబృందం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement