పుష్కరాలకు రాజమండ్రికి ప్రత్యేక విమానాలు | special flights to rajahmundry due to godavari pushkaralu, says ashok gajapathi raju | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు రాజమండ్రికి ప్రత్యేక విమానాలు

Published Sun, Jul 12 2015 1:25 PM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

పుష్కరాలకు రాజమండ్రికి ప్రత్యేక విమానాలు - Sakshi

పుష్కరాలకు రాజమండ్రికి ప్రత్యేక విమానాలు

తిరుమల: గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రికి ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్గజపతిరాజు వెల్లడించారు. ఆదివారం తిరుమలలో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని అశోక్గజపతి రాజు దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేకర్లతో అశోక్ మాట్లాడారు. తిరుపతిని నో ఫ్లైజోన్గా ప్రకటించాలని కేంద్రం సిఫార్స్ చేసిందని తెలిపారు.

శాటిలైట్ దేశాలు అతి తక్కువగా ఉన్న కారణంగా తిరుపతిని నో ఫ్లైజనో ప్రకటనకు ఆలస్యమవుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై  అశోక్గజపతి రాజు ఈ సందర్భంగా స్పందించారు.  ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఉండాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయని అశోక్గజపతి రాజు గుర్తు చేశారు.

విమర్శించడానికి తిరుమల వేదిక కాదంటూ విలేకర్లు అడిగిన ప్రశ్నలను అశోక్ సున్నితంగా తొసిపుచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, కేంద్ర మంత్రి అశోక్గజపతి రాజు ప్రయత్నించడం లేదంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement