మూఢ విశ్వాసాలు, బానుమతులపై ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన అధికారులకే..వాటిని నమ్మే పరిస్థితి రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా: మూఢ విశ్వాసాలు, బాణామతులపై ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన అధికారులకే..వాటిని నమ్మే పరిస్థితి రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. అందుకు మంచాల తహసీల్ధార్ కార్యాలయమే వేదికైంది. తహశీల్దార్ కార్యాలయానికే ఏదో దిష్టి తగిలిందని అధికారులు, సిబ్బంది భావించారు. దీంతో నర దిష్టి పోవడానికి ఏకంగా కార్యాలయానికే అధికారులు తంత్రం కట్టారు. ఇది చూసిన జనాలు ఏమిటి విచిత్రమని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.