సాయుధ పోరాట వార్షికోత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలి
సాయుధ పోరాట వార్షికోత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలి
Published Wed, Aug 24 2016 9:33 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ టౌన్ : తెలంగాణ సా«యుధ పోరాట వార్షికోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రను నిర్వహించాలని, 17న హైదరాబాద్‌లో బహిరంగ సభను నిర్వహించనున్నామన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతును ఇస్తుందని తెలిపారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడిని ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు. రైతులకు మూడవ విడత రుణమాఫీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పల్లా దేవేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి, గోద శ్రీరాములు, పల్లా నర్సింహారెడ్డి, నెల్లికంటి సత్యం, గన్నా చంద్రశేఖర్, ఉజ్జిని యాదగిరిరావు, ఉస్తెల సృజన, కలకొండ కాంతయ్య, వై.దామోదర్‌రెడ్డి, ఎం.నర్సింహారెడ్డి, ఎల్.శ్రవణ్‌కుమార్, సత్యనారాయణ, సిహెచ్.చంద్రయ్య, అంజాచారి, బాపురావు, రామలింగం, భిక్షంరెడ్డి, శ్రీనివాస్, జంగమ్మ, అశోక్, వెంకట్, సోమయ్య, చలపతి, రామచంద్రం, లింగయ్య, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement