వరంగల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. ఆ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకుడు దొమ్మాటి సాంబయ్య త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఇప్పటికే వైఎస్ఆర్ సీపీ ముఖ్యనేతలతో ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
త్వరలోనే అధికారికంగా టీడీపీకి గుడ్బై చెప్పి.. తన అనుచరులతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటీవల జరిగిన వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపర్చిన బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకపోగా, మూడోస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ జిల్లాలో టీడీపీకి ఈ రకంగా ఎదురుదెబ్బ తగులుతోంది.