రాయచోటి: వైఎస్సార్ జిల్లాలో వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులను, బాధితులను వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శించారు. ఈ పర్యటనలో వైఎస్సార్ జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లి, గాలివీడు, రాయచోటి మండలాల్లో దెబ్బతిన్న పంటను నాయకులు పరిశీలించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ జిల్లాలో భారీ వర్షాలకు తీవ్ర పంట నష్టం జరిగిందని చెప్పారు. ప్రాణ నష్టం జరిగిన బాధితులకు ప్రభుత్వం నుంచి ఎక్స్గేషియా ఇప్పించామన్నారు. రాయచోటికి గరికోన, వెనుజల్లు, శ్రీనివాసపురం రిజర్వాయర్లు వరప్రసాదమని మహానేత భావించి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారని అన్నారు. జిల్లాలో ప్రాజెక్టులు జలకళతో నిండిపోవడంతో ప్రజలు మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిని తలుచుకుంటున్నారని శ్రీకాంత్రెడ్డి తెలిపారు.
'ప్రాజెక్టులకు జలకళ మహానేత పుణ్యమే'
Published Thu, Nov 19 2015 8:21 PM | Last Updated on Tue, May 29 2018 2:26 PM
Advertisement
Advertisement