'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గెలిచాం' | YSRC Leader Amarnath's Hunger Strike for Railway Zone from Today | Sakshi
Sakshi News home page

'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గెలిచాం'

Published Thu, Apr 14 2016 8:19 PM | Last Updated on Fri, Aug 17 2018 8:06 PM

'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గెలిచాం' - Sakshi

'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గెలిచాం'

విశాఖ :  రైల్వే ప్రత్యేక జోన్ ఏర్పాటు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ గురువారం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి విజయ్ సాయి రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసి విజయం సాధించాం. ఇప్పుడు అదే తరహాలో రైల్వే ప్రత్యేక జోన్ కోసం పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.

రైల్వే జోన్ డిమాండ్ కొత్తది కాదని, దశాబ్ధాలుగా ఉందని గుర్తుచేశారు. పునర్విభజన చట్టంలోనూ హామీ ఇచ్చారని తెలిపారు. ఆ చట్టబద్ధ హక్కు కోసం పోరాడాల్సి రావడం దురదృష్టకరమన్నారు. రైల్వే జోన్ వస్తే ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమవుతుందని,  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తక్షణం విశాఖకు రైల్వే ప్రత్యేక జోన్ ను కేటాయించాలని విజయ్ సాయి రెడ్డి అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement