అంతర్జాతీయ క్రీడలు | International Sports | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ క్రీడలు

Published Wed, Sep 30 2015 11:47 PM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM

అంతర్జాతీయ క్రీడలు

అంతర్జాతీయ క్రీడలు

 విపత్తు నిర్వహణ..ప్రపంచకప్ ఫుట్‌బాల్ (ఫిఫా)
 ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను తొలిసారి 1930లో ఉరుగ్వేలో నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి నాలుగేళ్లకోసారి ఈ పోటీలు జరుగుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1942, 1946ల్లో ఈ పోటీలను నిర్విహ ంచలేదు. ఇప్పటి వరకు 20 సార్లు జరగ్గా ఎనిమిది దేశాలు మాత్రమే ఫిఫా ప్రపంచకప్‌ను గెలుచుకున్నాయి. అత్యధికంగా బ్రెజిల్ 5 సార్లు గెలుచుకుంది. జర్మనీ, ఇటలీ చెరో నాలుగుసార్లు విజేతలుగా నిలిచాయి. అర్జెంటీనా,ఉరుగ్వేలు రెండు సార్లు ఫిఫా ప్రపంచకప్‌ను సాధించాయి. ఫ్రాన్స్, ఇంగ్లండ్, స్పెయిన్‌లు ఒక్కోసారి విజేతలుగా నిలిచాయి. బ్రెజిల్ మాత్రమే ఇప్పటి వరకు జరిగిన 20 ప్రపంచకప్ పుట్‌బాల్ పోటీల్లో పాల్గొంది.
 1930లో జరిగిన మొదటి పుట్‌బాల్ ప్రపంచకప్‌లో కేవలం 13 దేశాలు పాల్గొనగా, 2014లో బ్రెజిల్‌లో జరిగిన 20వ ప్రపంచకప్‌లో 32 దేశాలు పాల్గొన్నాయి. ఈ ప్రపంచకప్‌లో తొలిసారిగా గోల్‌లైన్ టెక్నాలజీని ఉపయోగించారు.
 
 20వ ఫిఫా కప్ పోటీలు 2014 జూన్ 12 నుంచి జూలై 13 వరకు జరిగాయి. ఈ పోటీలను బ్రెజిల్ రెండోసారి నిర్వహించింది. కాగా తొలిసారి 1950 లో వీటిని నిర్వహించింది. ఫిఫా టోర్నమెంట్‌కు మస్కట్‌గా ‘ప్యులెకో’ను ఎంపిక చేశారు. ఫుట్‌బాల్, ఎకాలజీ పదాల కలయిక ఫ్యులెకో. ప్యులెకో అంటే ఆర్మడిల్లో అనే ఒక క్షీరదం. 20వ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో 32 దేశాలు 64 మ్యాచ్‌లు ఆడాయి. మొత్తం 171 గోల్స్ నమోదయ్యాయి. 2010 ప్రపంచకప్ చాంపియన్ స్పెయిన్ తొలిదశలోనే నిష్ర్కమించింది. జర్మనీ, అర్జెంటీనా, నెదర్లాండ్స్,బ్రెజిల్ సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో జర్మనీ, బ్రెజిల్‌ను 7-1 గోల్స్‌తో చిత్తుచేసి ఫైనల్‌కు చేరుకుంది. మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించి అర్జంటీనా ఫైనల్‌లోకి అడుగు పెట్టింది.
 
 ఫైనల్ మ్యాచ్ 2014 జూలై 13న రియోడిజనీరో నగరంలోని మారకానా స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో అర్జంటీనాను 1-0 గోల్స్‌తో ఓడించి జర్మనీ ప్రపంచకప్ విజేతగా నిలిచింది. జర్మనీ ఈ టోర్నమెంట్‌లో అత్యధికంగా 18 గోల్స్ చేసింది. మ్యాచ్‌లో అదనపు సమయంలో సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా వచ్చిన మారియా గోట్జె గోల్ చేయడంతో జర్మనీ విజయం అందుకుంది.జట్టు కెప్టెన్‌గా ఫిలిప్ లామ్ వ్యవహరించారు. విజేత జర్మనీ జట్టుకు 35 మిలియన్ డాలర్లు, రన్నరప్ అర్జంటీనాకు 25 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. మూడోస్థానం కోసం జరిగిన పోటీలో నెదర్లాండ్స్ బ్రెజిల్‌ను 3-0తో ఓడించింది. వరసగా నాలుగు టోర్నమెంట్లలో సెమీఫైనల్‌కు చేరుకున్న తొలిదేశంగా జర్మనీ రికార్డు సృష్టించింది.
 
 అవార్డులు
 గోల్డెన్ బూట్: ఈ అవార్డును ప్రపంచకప్ టోర్నమెంట్‌లో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుడికి ఇస్తారు. దీన్ని ఆరు గోల్స్ చేసిన కొలంబియాకు చెందిన జేమ్స్ రోడ్రిగ్వెజ్ అందుకున్నాడు. గోల్డెన్ బాల్: అత్యుత్తమ ప్రతిభ చూపిన ఆటగాడికి ఇచ్చే గోల్డెన్ బాల్ అవార్డును అర్జంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ అందుకున్నాడు. గోల్డెన్ గ్లోవ్: అత్యుత్తమ గోల్ కీపర్‌కు ఇచ్చే గోల్డెన్ గ్లోవ్ అవార్డుకు జర్మనీ గోల్ కీపర్ మాన్యుయెల్ న్యూర్ ఎంపికయ్యాడు. బెస్ట్ యంగ్ ప్లేయర్ అవార్డు: 21 ఏళ్ల కంటే తక్కువ వయసున్న అత్యంత ప్రతిభావంతుడైన క్రీడాకారుడికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఫ్రాన్స్‌కు చెందిన పాల్ పోగ్బా ఎంపికయ్యాడు. ఫెయిర్ ప్లే అవార్డు: కొలంబియా జట్టుకు లభించింది.
 
 హైలైట్స్:
 అత్యధికంగా 8 సార్లు ప్రపంచకప్ ఫైనల్‌కు, 13 సార్లు సెమీఫైనల్‌కు చేరుకున్న ఏకైక జట్టు జర్మనీ. దీంతో పాటు జర్మనీ క్రీడాకారుడు మిరోస్లావ్ క్లోజ్ ప్రపంచకప్ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు.
 
 క్లోజ్ 23 మ్యాచుల్లో 16 గోల్స్ చేసి బ్రెజిల్ మాజీ ఆటగాడు రొనాల్డో చేసిన 15 గోల్స్ రికార్డును అధిగమించాడు. బ్రెజిల్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో క్లోజ్ గోల్ చేయడంతో ఈ ప్రపంచకప్ రికార్డు నమోదయ్యింది.
 
 ఫిఫా ప్రపంచకప్ వేదికలు - విజేతలు
 సంవత్సరం    ఆతిథ్యదేశం    విజేత
 1930    ఉరుగ్వే    ఉరుగ్వే
 1934    ఇటలీ    ఇటలీ
 1938    ఫ్రాన్స్    ఇటలీ
 2006    జర్మనీ    ఇటలీ
 2010    దక్షిణాఫ్రికా    స్పెయిన్
 2014    బ్రెజిల్    జర్మనీ
 
 ప్రపంచకప్ క్రికెట్
 ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ వరల్డ్ కప్ 1975లో ప్రారంభమైంది. ఈ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ వరల్డ్ కప్ ప్రతి నాలుగేళ్లకోసారి జరుగుతుంది. ఇంతవరకు 11 ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జరిగాయి.
 సంవత్సరం    ఆతిథ్య దేశం    విజేత
 1975    ఇంగ్లండ్    వెస్టిండీస్
 1979    ఇంగ్లండ్    వెస్టిండీస్
 1983    ఇంగ్లండ్    ఇండియా
 1987    ఇండియా, పాకిస్థాన్    ఆస్ట్రేలియా
 1992    ఆస్ట్రేలియా,
     న్యూజిలాండ్    పాకిస్థాన్
 1996    ఇండియా, పాకిస్థాన్,
     }లంక    శ్రీలంక
 1999    ఇంగ్లండ్    ఆస్ట్రేలియా
 2003    దక్షిణాఫ్రికా    ఆస్ట్రేలియా
 2007    వెస్టిండీస్    ఆస్ట్రేలియా
 2011    ఇండియా, బంగ్లాదేశ్,
     }లంక    ఇండియా
 2015    ఆస్ట్రేలియా,
 న్యూజిలాండ్    ఆస్ట్రేలియా
 ఆస్ట్రేలియా అత్యధికంగా ఐదుసార్లు వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. భారత్,వెస్టిండీస్ చెరో రెండు సార్లు గెలుచుకోగా శీలంక, పాకిస్థాన్ ఒక్కోసారి కప్‌ను సాధించాయి.
 11వ ప్రపంచకప్ 2015 ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 వరకు ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ దేశాల్లో జరిగింది. ఈ టోర్నమెంట్‌లో 14 దేశాలు పాల్గొన్నాయి. 14 వేదికలపై 49 మ్యాచ్‌లు జరిగాయి. ఆస్ట్రేలియా 26 పోటీలకు ఆతిథ్యమివ్వగా న్యూజిలాండ్‌లో 23 మ్యాచ్‌లు జరిగాయి.
 ఈ ప్రపంచకప్‌నకు సచిన్ టెండూల్కర్ ప్రచారకర్తగా వ్యవహరించాడు.
 తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను ఓడించి ప్రపంచకప్ ఫైనల్‌కు తొలిసారి చేరుకుంది. రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి ఏడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది.
 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ 2015 మార్చి 29న మెల్‌బోర్న్‌లో జరిగింది. ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి ప్రపంచకప్‌ను సాధించింది.
 ఈ మ్యాచుల్లో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా మైకేల్ క్లార్క్, న్యూజిలాండ్ జట్టు కెప్టెన్‌గా బ్రెండన్ మెక్ కల్లమ్ ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్ జేమ్స్ ఫాల్క్‌నర్‌కు ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. టోర్నమెంట్‌లో 22 వికెట్లు సాధించిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.
 
 2015 ప్రపంచకప్ విశేషాలు:
 న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్ ఈ టోర్నమెంట్‌లో అత్యధికంగా 547 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ ప్రపంచకప్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా అవతరించాడు. 2015 ఫిబ్రవరి 24న జింబాబ్వేపై జరిగిన మ్యాచ్‌లో గేల్ 215 పరుగులు చేశాడు.
 న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్ 2015 మార్చి 21న వెస్టిండీస్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు (237 పరుగులు)ను నమోదు చేశాడు.
 ఇంగ్లండ్ పేసర్ స్టీవ్ ఫిన్ ఆస్ట్రేలియాపై మూడు బంతుల్లో మూడు వికెట్లు తీయగా దక్షిణాఫ్రికా బౌలర్ జాన్ పాల్ డుమిని శ్రీలంకపై హ్యాట్రిక్ సాధించాడు.
 శ్రీలంక బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర వరసగా నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.
 భారత్ తరఫున శిఖర్ ధావన్ అత్యధికంగా 412 పరుగులు సాధించాడు. బౌలర్లలో ఉమేశ్ యాదవ్ అత్యధికంగా 18 వికెట్లు తీశాడు.
 
 మాదిరి ప్రశ్నలు
 
 1.    2018లో ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఏ దేశంలో జరగనుంది?
     1) అమెరికా    2) రష్యా
     3) స్పెయిన్        4) జపాన్
 2.    జూల్స్ రెమైట్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది?
     1) హాకీ        2) గోల్ఫ్
     3) పుట్‌బాల్    4) జపాన్
 3.    ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ 2022కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?
     1) సౌది అరేబియా    2) యూఏఈ
     3) ఖతార్        4) కువైట్
 4.    {పపంచకప్ ఫుట్‌బాల్ చరిత్రలో సెమీఫైనల్లో 7 గోల్స్ చేసిన జట్టు ఏది?
     1) బ్రెజిల్        2) నెదర్లాండ్స్
     3) అర్జంటీనా    4) జర్మనీ
 5.    తొమ్మిది అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేధానికి గురైన లూయీ సురెజ్ ఏ దేశానికి చెందిన ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు?
     1) చిలీ        2) ఇటలీ
     3) ఉరుగ్వే        4) పోర్చుగల్
 6.    2017లో అండర్-17 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఏ దేశంలో జరగనుంది?
     1) ఘనా        2) ఈజిప్ట్
     3) భారత్        4) దక్షిణ కొరియా
 7.    12వ ప్రపంచకప్ క్రికెట్ 2019లో ఏదేశంలో జరగనుంది?
     1) ఇంగ్లండ్        2) వెస్టిండీస్
     3) దక్షిణాఫ్రికా    4) పాకిస్థాన్
 8.    2023లో క్రికెట్ ప్రపంచకప్‌నకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?
     1) ఇంగ్లండ్        2)భారత్
     3) న్యూజిలాండ్    4) శ్రీలంక
 9.    క్రికెట్ ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు ఎవరి పేరిట ఉంది?
     1) రోహిత్ శర్మ    2) వీరేంద్ర సెహ్వాగ్
     3) క్రిస్ గేల్        4) మార్టిన్ గప్టిల్
 10.    2015 ప్రపంచకప్ క్రికెట్‌కు ప్రచార కర్త ఎవరు?
     1) రికీ పాంటింగ్    2) బ్రయాన్ లారా
     3) స్టీవ్ వా        4) సచిన్ టెండూల్కర్
 
 సమాధానాలు
 1) 2    2) 3    3) 3    4) 4    5) 3
 6) 3    7) 1    8) 2    9) 4    10) 4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement